![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -398 లో.. కృష్ణ, మురారి, ముకుంద, ఆదర్శ్ లు సరదాగా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే ఆదర్శ్ తన ఫ్రెండ్ నుండి ఫోన్ వస్తుంది. దాంతో అతను పక్కకి వెళ్లి మాట్లాడతాడు. ఆదర్శ్ మాట్లాడుతుంటే అలాగే మాట్లాడతాడు గానీ నేను వెళ్లి ఈ గ్లాస్ ఇచ్చేసి వస్తానని మురారి వెళ్తుంటే.. నేనే వెళ్తానని డ్రింక్ గ్లాస్ తీసుకొని ముకుంద వెళ్తుంది.
మరొకవైపు బంగారమంటు మురారి ప్రేమగా కృష్ణని పిలవడంతో డ్రింక్ చేస్తేనే ఇలా వస్తయని కృష్ణ అంటుంది. కాసేపు ఆగండి మీకు ఒక సర్ ప్రైజ్ అని కృష్ణ చెప్పాగానే.. మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ముకుంద వెళ్ళేసరికి ఆదర్శ్ అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతుంటాడు. ముకుంద డ్రింక్ తాగి నిజం చెప్పాలని అనుకుంటుంది. ముకుంద డ్రింక్ చెయ్యడం కృష్ణ, మురారి ఇద్దరు చూస్తారు. ఎలాగైన ముకుంద ఎంజాయ్ చెయ్యాలని ఫిక్స్ అయిన్నట్లుందని మురారితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత ముకుంద డ్రింక్ చేస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు ఇష్టం లేదంటూ ఇన్ని రోజుల నుండి చెప్పలని అనుకున్నవన్ని చెప్తుంది. ఇప్పుడు రూమ్స్ కూడా నేను బుక్ చెయ్యలేదు. కృష్ణ, మురారి వాళ్ళే చేసారని ముకుంద అంత చెప్తుంది. ఆదర్శ్ వింటున్నాడని ముకుంద అనుకుంటుంది కానీ ఆదర్శ్ అదంతా ఏం వినడు.. బ్లూ టుత్ అఫ్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి ముకుంద ఉండడం చూసి.. ఏంటి ముకుంద నాకోసం గ్లాస్ తీసుకొని వచ్చావా అని ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
.webp)
ఆ తర్వాత ముకంద ఆదర్శ్ ల శోభనానికి కృష్ణ అంతా సిద్ధం చేస్తుంది. అది చూసి ముకందనే రూమ్ డెకరేషన్ చేసిందేమోనని ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అపుడే ముకుంద వస్తుంది. రూమ్ డెకరేట్ చేసింది తను కాదని ముకుంద చెప్పే ప్రయత్నం చేసిన ఆదర్శ్ వినడు.. మరొకవైపు కృష్ణ తన రూమ్ ని శోభనం కోసం డెకరేషన్ చేస్తుంది. అది చూసి మురారి హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇదేనా సర్ ప్రైజ్ అని అంటాడు. ఆ తర్వాత ముకుందని ఆదర్శ్ టచ్ చేయబోతుంటే నీకో సర్ ప్రైజ్ ఉంది తీసుకొని వస్తానంటూ ముకుంద అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీ ఇద్దరు ఆదర్శ్ దగ్గరికి వస్తారు. ముకుంద ఎక్కడ అని వాళ్ళు అడగడంతో నాకు సర్ ప్రైజ్ తీసుకొని రావడానికి వెళ్ళిందని ఆదర్శ్ చెప్తాడు. తరువాయి భాగంలో ముకుందకి కాలు బెనుకుతుంది. ముకందకి శోభనం ఇష్టం లేకే ఇలా చేస్తుందని కృష్ణకి అర్థం అవుతుంది. ఆ విషయం మురారికి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |